సైలెంట్ గా ఓజి సినిమా పూర్తి చేసే పనిలో పవర్ స్టార్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఆయన హీరోగా కంటే తన వ్యక్తిత్వంతోనే ఎక్కువగా అభిమానాన్ని సంపాదించుకున్నాడు .అందుకే ఆయనంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమాల కంటే ఆయన రాజకీయాలతోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు. సినిమాలను అప్పుడప్పుడు చేస్తూ ఎక్కువ సమయం మాత్రం రాజకీయాలకే కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

అయితే ప్రస్తుతం జరిగిన ఎలక్షన్స్ లో పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.  అయితే ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గము నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని అంటున్నారు. మొత్తానికి అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కీలక పాత్ర పోషించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిజల్ట్ కోసం ఆయనతోపాటు ఆయన వందలాది అభిమానులు వేయికళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా జూన్ 4న ఎలక్షన్ రిజల్ట్ రాబోతోంది. అయితే ఎలక్షన్ రిజల్ట్ రావడానికి మరొక 20 రోజులు సమయం ఉంది.

ఈ నేపథ్యంలోనే ఆయన ఈ 20 రోజుల సమయం తన సినిమాల కోసం కేటాయించాలి అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ 20 రోజుల సమయాన్ని తన సినిమాలతో బిజీ కావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆయన ఒప్పుకున్న ఓజి సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేయాలి అని పవర్ స్టార్ అనుకున్నట్లుగా సమాచారం.  ఇకపోతే ఈ గ్యాప్ లో డబ్బింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక నెల రోజులపాటు మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లి ఆ తరువాత మళ్లీ తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను చేయాలి అని అనుకుంటున్నారట పవర్ స్టార్. మరి ఒకవైపు రాజకీయాలు మరొకవైపు వస్తే నిమాలని ఆయన ఏవిధంగా బ్యాలెన్స్ చేస్తారు అన్నది చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: