ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: దేవర ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్..!?

Anilkumar
త్రిబుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎంతో క్రాజ్  సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక అప్పట్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ తెరపై కనిపించడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ


 సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైజ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతున్నట్లుగా ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  మొదటి భాగం 2024 అక్టోబర్ 10న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు గ్లింప్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా దేవరాయ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని విడుదల

 చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ ని కూడా విడుదల చేశారు.  జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా నుండి ఫస్ట్ సింగిల్  మే 19 విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు చిత్ర బృందం. ఈ మేరకు దానికి సంబంధించిన ఒక పోస్టర్ని సైతం విడుదల చేశారు. దాంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే 'ఫియర్ సాంగ్' అన్న పేరుతో ఈ పాట విడుదల కాబోతోంది అయితే తాజాగా ఈ విషయంపై అగ్ర నిర్మాత సూర్యదేవర నాగ వంశీ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. జైలర్ సినిమాలోని హుకుం పాటను మించేలాగా ఈ పాట ఉంటుంది అని ఆయన తెలిపాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: