రజిని డెడికేషన్ కి షాక్ అవుతున్న లోకేష్ కనగరాజ్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు దేశావ్యాప్తంగా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బస్ కండక్టర్గా జీవితాన్ని మొదలుపెట్టిన రజిని.. అంచలంచలుగా ఎదుగుతూ నేడు ఆసియాలోనే పెద్ద సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు.తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్పరచుకున్న రజిని.. ఏడుపదుల వయసులో కూడా ఎక్కడా ఎవరికీ తగ్గకుండా సినిమాలు చేస్తూ తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికీ తన స్టైల్, యాటిట్యూడ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.ఆయన నటించిన సినిమాలతో ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్లు ఇండస్ట్రీ హిట్లు కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీ, లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ యాక్షన్‌ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఎలాగైనా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో రజనీకాంత్, లోకేష్ ఇద్దరు శ్రమిస్తున్నారు.


విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కిన లియో సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నాడు లోకేష్ కనగరాజ్.దీంతో ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ స్టార్ రేంజ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మరోసారి తన స్టామినాని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు లోకేష్ కనగరాజ్. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని.. ఏకంగా ఈ మూవీ క్లైమాక్స్ షూట్ కోసం దాదాపు రూ.10 కోట్లు ఖర్చుపెట్టి మరి ప్లాన్ చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకు ఏ సినిమాలోను ఫైట్ సీన్స్ చూపించని విధంగా వైవిధ్యమైన ఫైట్ ను తెరకెక్కించి సూపర్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడట లోకేష్‌ లోకేష్ కనగరాజ్. రజినీకాంత్ తాజాగా వెట్టయ్యాన్ సినిమా పూర్తి చేసుకున్నాడు. అయితే అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి ఏమాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోకుండా కూలి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారట. అందుకోసం కేవలం 3 వారాలు మాత్రమే సూపర్ స్టార్ బ్రేక్ తీసుకున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్ 6 నుంచి స్టార్ట్ కానుందట. 73 ఏళ్ల వయస్సులో రజినీకాంత్ డెడికేషన్ చూసి షాక్ అవుతున్న అంటూ లోకేష్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: