బ్రహ్మముడి సీరియల్ కోసం ఒక్క రోజుకి అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హమీద ..!?

Anilkumar
స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక ఇందులో కావ్య అక్కగా రాహుల్ భార్యగా బిగ్ బాస్ నటి హమీద నటిస్తోంది. ఇక ఈ సీరియల్ లో హామీద ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్న హమీద గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  బిగ్ బాస్ లో తన అందచందాలతో ఎంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హమీద నటిస్తున్న మొట్టమొదటి సీరియల్ ఇదే. అయితే బిగ్బాస్ షో తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పుడు ఈ

 సీరియల్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది. స్వప్న అనే పాత్రలో చాలా అద్భుతంగా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ సీరియల్ చూసేంతవరకు హా మీద ఎంత అద్భుతంగా నటిస్తుందా అని ఎవరికి తెలియదు. ఇకపోతే తనను ఎలాగైనా వదిలించుకోవాలి అని చూస్తున్న భర్త అత్తకు చుక్కలు చూపిస్తున్న రఫ్ అండ్ అమ్మాయిగా ఈ సీరియల్లో అందరినీ మెప్పిస్తుంది హమీద. ఇకపోతే హమీద ఈ సీరియల్ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా అందుతున్న

 సమాచారం మేరకు హమీద రోజుకు పది వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక నెలకు సుమారు హమీద 20 నుంచి 25 రోజులు బ్రహ్మముడి సీరియల్ కోసం పని చేస్తుందట. ఆ లెక్కన హమీద నెలకు రూ. 250000 సంపాదిస్తుందని సమాచారం. అంతేకాదు పలు టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది. హమీద మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ‘ సాహసం చేయరా డింభకా ‘ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షో తో హమీద కెరీర్ టర్న్ అయింది.   హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. తెలుగు రాకపోయినా హామీదకి బిగ్ బాస్ లో రెండు సార్లు అవకాశం వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో హమీద కంటెస్టెంట్ గా వెళ్ళింది. సింగర్ శ్రీరామచంద్ర తో లవ్ ట్రాక్ బాగా హైలెట్ అయింది. కానీ హౌస్ లో ఎక్కువ కాలం రాణించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: