దానికోసం కడుపు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.. మెహ్రీన్..!

Anilkumar
టాలీవుడ్ యంగ్ బ్యూటీ హీరోయిన్  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఆమె ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారు. ఆమె గర్భాశయం నుండి అండాలను తీసి భద్రపరచుకున్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా తనే తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విషయం చెప్పాలా వద్దా అని  కన్ఫ్యూజన్ కి గురయ్యాను అని మెహ్రిన్ ఇందులో భాగంగానే వెల్లడించింది. అంతేకాదు ప్రపంచంలోని చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని వాళ్ళకి అవగాహన రావాలి అని ఇలా చేశాను అంటూ తన సోషల్

 మీడియా ద్వారా వెల్లడించింది.  ఈ నేపథ్యంలోనే ఈ విషయానికి గాను ఆమె పై సోషల్ మీడియా వేదిక ద్వారా అనేకమైన రూమర్స్ వచ్చాయి. మెహ్రీన్న్ గర్భం దాల్చింది అని పెళ్లి కాకుండానే మెహరీన్ తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేశారు. అయితే తాజాగా ఈ వార్తల పై స్పందించింది ఈమె. ఆమె మీడియా రాతల పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీంతో తాజాగా ఆమె చేసిన పలు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవడానికి గర్భం దాల్చాల్సిన

 అవసరం లేదు. మీ స్వార్థం కోసం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారు. జర్నలిస్టులకు బాధ్యత ఉండాలి. పిల్లలు అప్పుడే వద్దని భావించే తల్లిదండ్రులు అన్ని విధాలుగా సిద్ధం అయ్యాక పిల్లల్ని కనేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ విధానం గురించి సరిగా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానకపోతే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.... అని మెహ్రీన్ హెచ్చరించారు. వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న ఎగ్స్ ఫ్రీజింగ్ చేయడం ద్వారా భవిష్యత్ తో పిల్లల్ని కనవచ్చు. తాను కూడా ఎగ్ ఫ్రీజింగ్ కి పాల్పడ్డానని ఆ మధ్య రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చెప్పడం విశేషం.. అంటూ చెప్పుకొచ్చింది మెహరీన్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: