మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మిత..!?

Anilkumar
పిఠాపురం నియోజకవర్గం నుండి టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి లోకి దిగిన సంగతి మనందరికీ తెలిసిందే. జనసేన పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో పోటీ చేస్తున్న నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు చాలామంది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచారు. ఇప్పటికే పిఠాపురంలో మెగా హీరోలు అందరూ కూడా కలిసి ప్రచారం చేయడం మనం చూసాం. అదేవిధంగా జబర్దస్త్ కమెడియన్లు చాలామంది కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కచ్చితంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలవాలి అన్న ఉద్దేశంతో జబర్దస్త్ కమెడియన్లు అలాగే సెలబ్రిటీలో సైతం ప్రచార కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమాలలో
 భాగంగా చివరి రోజు రాంచరణ్ మరియు ఆయన తల్లి సురేఖ సైతం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే తాజాగా ఇప్పుడు మెగా డాటర్ సుస్మిత తాజాగా తన బాబాయ్ గెలుపు కోసం షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో సుస్మిత చేసిన పలు కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా డాటర్ సుస్మిత మొదటిసారి తన బాబాయ్ కోసం సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలియజేశారు. అతని పోరాటం నిజమైనది ఆయన హృదయం ప్రజల కోసమే.. అతడు నిజం కోసమే నిలబడతాడు దయచేసి అండగా నిలబడండి అంటూ సుస్మిత తన బాబాయ్ ని గెలిపించాలని కోరుతూ
 సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ విధంగా మొదటిసారి తన బాబాయ్ కోసం సుస్మిత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ క్షణాలలో వైరల్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కథ ఎన్నికలలో భాగంగా భీమవరం గాజువాక ప్రాంతాలలో పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు కానీ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈయన పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: