తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలను నిర్మించి చాలా సంవత్సరాలుగా అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న బ్యానర్ లలో వైజయంతి బ్యానర్ ఒకటి. దీనిని అశ్విని దత్ స్థాపించారు. ఈ బ్యానర్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో , చిన్న హీరోలతో సినిమాలను నిర్మించి ఎన్నో విజయాలను అందుకున్నారు. ఇక ఈ సంస్థ స్థాపించి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికి కూడా ఈ బ్యానర్ లో సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి విజయాలను అందుకుంటునే ఉన్నాయి.
ఇకపోతే ఈ బ్యానర్ కి ఒక తేదీ చాలా ప్రత్యేకం. అదే మే 9 వ తేదీ. ఎందుకు ఈ తేదీ ఈ బ్యానర్ కు ఇంత ప్రత్యేకము అంటే ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని వైజయంతి బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమా మే 9 వ తేదీనే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి బయోపిక్ ను మహానటి పేరుతో వైజయంతి బ్యానర్ వారు రూపొందించారు.
ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించగా ... నాగ్ అశ్విన్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా మే 9 వ తేదీనే విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ బ్యానర్ వారు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ ని కూడా మే 9 వ తేదీనే విడుదల చేశారు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ బ్యానర్ వారు మే 9 వ తేదీన విడుదల చేసిన మూడు మూవీ లు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. దానితో ఈ బ్యానర్ కి ఇది ఒక స్పెషల్ తేదీగా మారిపోయింది.