విజయ్ నెక్స్ట్ రెండు మూవీల అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు అనగా మే 9 వ తేదీన ఆయన నటించబోయే రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు విడుదల అయ్యాయి. మరి వాటి ప్రకారం ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ హీరోగా రాజా వారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మాణంలో ఓ మూవీ త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
 

ఇకపోతే ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఓ చెయ్యి కత్తిని పట్టుకొని ఉంది. ఇక ఈ పోస్టర్ లో కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధము నాతోనే అనే క్యాప్షన్ ను రాశారు. ఇకపోతే ఈ పోస్టర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరుపు రంగులో ఉంది. ఈ క్యాప్షన్ ను బట్టి చూసిన , ఈ బ్యాగ్రౌండ్ బట్టి చూసిన ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని అర్థం అవుతుంది. అలాగే ఇందులో భారీ రక్త పాతం సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు ఈ పోస్టర్ ను బట్టి అర్థం అవుతుంది. ఇకపోతే గతంలో విజయ్ తో టాక్సీవాలా సినిమాని తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాయన్ మరో మూవీ ని కూడా విజయ్ తో రూపొందించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే.
 

ఇక తాజాగా ఎందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విలువడింది. విజయ్ హీరోగా రాహుల్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇలా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటించబోయే రెండు సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: