ప్రేమలన్నీ శృంగారం కోసమే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్‌..!!

murali krishna
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఈయన సినిమా వస్తుదంటే థియేటర్స్ వద్ద ఆ సందడే వేరే ఉండేది.ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ట్ డైరెక్టర్ .. డేరింగ్ అండ్ డాషింగ్ అనగానే మనకి ఈ పేరే గుర్తొస్తుంది . అంతలా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్నాడు.అయితే సడన్ గా ఆయన క్రేజ్ మొత్తం డమాల్ అంటూ పడిపోయింది . దానికి కారణాలు ఏవైనా కావచ్చు.. ఎన్నెన్నో ఉన్నాయి కూడా.. మరీ ముఖ్యంగా లైగర్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని తెరకెక్కించారు . ఈ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయింది . ఆ తర్వాత ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా గోడ ఎక్కింది .
త్వరలోనే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా గుడ్ బై చెప్పి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది .ప్రేమ కంటే కుటుంబానికి ఎక్కువ విలువివ్వాలని దర్శకుడు పూరి జగన్నాథ్‌ అన్నారు. 'పూరి మ్యూజింగ్స్‌' లో భాగంగా మరో ఆసక్తికర వీడియోను విడుదల చేశారు.చాలా మంది లవ్ ఫెయిల్యూర్ ని చూస్తారని.. అలా జరిగిన తర్వాత తినకుండా, ఏ పనీ చేయకుండా.. ఎప్పుడూ ఏడుస్తూ, బాధ పడుతూ, ఏదో కోల్పోయినట్లు ఉంటారని తెలిపారు. ఈక్రమంలోనే మద్యానికి బానిసై మరింత ఎక్కువగా ఏడుస్తుంటారు. తమ ప్రేమను ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదంటూ రచ్చ చేస్తారని.. అయితే ఇదంతా ప్రేమ కాదని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు. నిజానికి మీరు ప్రేమ అనుకుంటున్న ఇది ఇగో అని.. మీకు ఆ అమ్మాయి దక్కలేదన్న ఉక్రోషంతోనే ఇలా చేస్తారంటూ తెలిపారు. ఆ అమ్మాయి కోసం.. పాపం ఈ అబ్బాయి తాగుబోతు అయ్యాడని అంతా అనుకోవాలనే అలా చేస్తారంటూ వివరించారు.అయితే మీరు ఆ అమ్మాయిని ప్రేమించిన దానికంటే ఎక్కువగా.. మిమ్మల్ని మీ అమ్మ ప్రేమిస్తుందని.. కానీ ఎప్పుడైనా ఆమె కోసం కత్తి పెట్టి చేయి కోసుకున్నారా అంటూ పూరీ ప్రశ్నించారు. మన ప్రేమలన్నీ సెక్స్ రిలేటెడ్ అని ఎప్పుడూ అందమైన అమ్మాయినే ఎందుకు ప్రేమిస్తారని కూడా అన్నారు. మరి కాళ్లు, చేతులు లేని అమ్మాయిలను ఎందుకు ప్రేమించరని అడిగారు. అలాగే నిజంగానే మీరు ఆమెను ప్రేమించి ఉంటే తన నిర్ణయాన్ని కూడా గౌరవించాలని చెప్పుకొచ్చారు.                                                                                                                                                                  నిజంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఏంజెలినీ జూలియెట్ లు కూడా పెళ్లయ్యాక.. బెడ్ అటొకరు, ఇటొకరు తిరిగే పడుకున్నారని తెలిపారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లలో చాలా మంది  రెండేళ్లకు మించి సరిగ్గా కాపురం చేయలేరని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లంతా ఇంకో అమ్మాయిని చూడమని ప్రామిస్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. నిజంగానే అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయితే.. ఇలాగే ఏడుస్తూ ఉండని.. తన జీవితంలో తాను ముందుకు వెళ్తుందని తెలిపారు. నిజంగానే అమ్మాయి ప్రేమను పొందలేకపోతే ఏడవకుండా.. జీవితంలో ముందుకు వెళ్తూ.. కెరియర్ లో సక్సెస్ సాధించమని చెప్పారు. ఇలా లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ లో ఏడుస్తూ, రచ్చ చేస్తే... కొన్నేళ్ల తర్వాత వాటినే మీరు జోకులుగా చెప్పుకుంటూ నవ్వుకుంటారని అన్నారు. ఇలా జీవితంపై సరైన సందేశం ఇచ్చిన పూరీ తనలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు.జీవితంలో చాలా మంది ప్రేమలో ఫెయిల్ అవుతూ ఉంటారు . ఆ టైంలో తిండి తినాలనిపించదు .. నిద్ర రాదు గుండెల్లో తెలియని మంట .. దానికి తోడు మందు అలవాటు నేర్చుకుంటారు . స్నేహితులు ఓదార్చిన ఆ బాధ తీరదు.. కొన్నిసార్లు ఏం చేస్తామో మనకే తెలియదు .. చాలామంది దీన్ని ప్రేమ అనుకుంటారు. నో అది ఈగో నీకు ఎంత ఈగో ఉంటే అంత నరకం చూస్తావు ..అది నిజం నీకు దక్కలేదు అన్న ఉక్రోసమే అది ..ప్రేమ కానే కాదు .. మీ అమ్మ కంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఎక్కువగా ప్రేమిస్తారా..? అమ్మకోసం ఏనాడైనా చేతులు కోసుకున్నావా? ఏడ్చావా? అదంతా ఫేక్ నువ్వు కేవలం శృంగారం కోసం మాత్రమే అమ్మాయిలను ప్రేమిస్తావు .. అదంతా మాయ మత్తులో జరుగుతుంది ..అంటూ నేటి యువత తప్పుదారి పడుతున్న విధానాన్ని కళ్ళకు కట్టినట్లు పచ్చిగా బోల్డ్ గా చెప్పుకొచ్చారు . పూరి జగన్నాథ్ కి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: