భారత్: దేశంలో మరోసారి కరోనా కలకలం.. తక్కువ సమయంలోనే ఎక్కువ కేసులు..??

Suma Kallamadi
భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తుంది. గడిచిన 24 గంటల్లో 324 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయని ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది. ఈ కేసుల్లో 290 KP.2, 34 KP.1 సబ్-టైప్స్‌కు చెందినవి. ఈ ఉప-రకాలు సింగపూర్‌లో కేసుల పెరుగుదలకు కారణమైన JN1 (ఓమిక్రాన్ వేరియంట్ ఉప-రకం) నుంచి పుట్టుకొచ్చాయి.
అయితే, ఈ కొత్త సబ్-టైప్స్ వల్ల ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య లేదా తీవ్రమైన కేసులలో పెరుగుదల కనిపించడం లేదు. కాబట్టి, భయపడవలసిన అవసరం లేదు. సాధారణంగా వైరస్‌లు, ముఖ్యంగా SARS-CoV2 వంటివి, క్రమంగా మారుతూ ఉంటాయి. భారత సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం (INSACOG) సేకరించిన డేటా ప్రకారం, భారతదేశంలో ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 34 KP.1 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 23 పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాయి. మహారాష్ట్రలో నాలుగు KP.1 కేసులు, గుజరాత్, రాజస్థాన్‌లో రెండు కేసులు, గోవా, హర్యానా, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్క కేసు నమోదైంది.
INSACOG దేశవ్యాప్తంగా 290 KP.2 కేసులను గుర్తించింది. ఈ కేసుల్లో 148 మహారాష్ట్ర నుంచి వచ్చాయి. KP.2 ఉప-రకం నమోదైన ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే.. పశ్చిమ బెంగాల్ 36, గుజరాత్ 23, రాజస్థాన్ 21, ఉత్తరాఖండ్ 16, ఒడిశా 17, గోవా 12, ఉత్తర ప్రదేశ్ 8, కర్ణాటక 4, హర్యానా 3, మధ్యప్రదేశ్ 1, ఢిల్లీ 1 నమోదయ్యాయి. ఇండియాలో KP.2, KP.1 అనే రెండు కొత్త కోవిడ్-19 సబ్-టైప్స్ ఉండగా వీటి గురించి ఇంకా పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలకు తెలియ రాలేదు. వాటి గురించి తెలుసుకునేందుకు వాటిని అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.సింగపూర్‌లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోంది.  దాంతో అక్కడ ప్రజలు మళ్లీ మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం సలహా ఇచ్చింది. సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) ప్రకారం, మే 5-11 వారానికి కోవిడ్-19 కేసుల సంఖ్య 25,900కి పెరిగింది, ఇది మునుపటి వారంతో పోలిస్తే 90% పెరుగుదల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: