జగన్ గెలిస్తే.. చంద్రబాబు జైలుకే?

praveen
సాధారణంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు రాజకీయాలు వేడెక్కడం పోలింగ్ ముగిసిన తర్వాత అంత ప్రశాంతంగా మారడం జరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కు సంబంధించిన పోలింగ్ మే 13వ తేదీన జరిగింది. అయితే ఇలా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు కూడా ఆంధ్ర రాజకీయాల్లో రాజుకున్న వేడి చల్లారలేదు.

 కనీసం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అయినా పరిస్థితి అదుపులోకి వస్తుందనుకుంటే.. మరింత ఉత్రిక పరిస్థితులు నెలకొన్నాయ్. ఏకంగా ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై దాడి చేయడం సంచలనంగానే మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఫలితాలలో ఎవరు మళ్లీ ఆంధ్రలో అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. సింగిల్ గా బరిలోకి దిగిన జగన్ ను ఓడించేందుకు అటు చంద్రబాబు జనసేన బిజెపి పార్టీలను పొత్తు పెట్టుకుని మరి ముందుకు సాగారు అన్న విషయం తెలిసిందే.

 ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కొన్ని సర్వే రిపోర్టులు కూటమి గెలుస్తుందని చెబితే.. ఇంకొన్ని సర్వే రిపోర్ట్ లు జగన్ రెండోసారి అధికారాన్ని దక్కించుకుంటాడు అని చెప్పాయ్. దీంతో ఏ పార్టీ గెలుస్తుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఒకవేళ జగన్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మెజారిటీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నారంటే.. చంద్రబాబు మరోసారి జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదైన ఒక్కసారి కూడా ఆయన జైలుకు వెళ్ళలేదు. కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు.. జగన్ వివిధ కేసుల్లో చంద్రబాబును జైలుకు పంపించాడు. దీంతో రాష్ట్రంలో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఇక జగన్ మరోసారి అధికారంలోకి వస్తే చంద్రబాబును టార్గెట్ చేసుకొని మళ్ళీ జైలుకు పంపించడం ఖాయమని పాత కేసులను మళ్లీ ఫ్రీ ఓపెన్ చేయించి అనుకున్నది చేస్తాడని   రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: