ఆ పద్ధతిలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన "మైదాన్"..!

Pulgam Srinivas
అజయ్ దేవగన్ , ప్రియమణి ప్రధాన పాత్రల్లో అమిత్ శర్మ దర్శకత్వంలో మైదాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం ఏప్రిల్ 10 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడం , అలాగే ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను , విమర్శకులను బాగానే మెప్పించింది. దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయిన ఈ సినిమా తాజాగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. ఎవరైనా ఈ సినిమాను UHD లో చూడాలి అంటే 349 రూపాయలు పెట్టి చూడాలి. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మామూలు పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

ఇకపోతే ఈ మూవీ లోని అజయ్ దేవగన్ నటనకు అలాగే ప్రియమణి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. కొన్ని రోజుల క్రితమే జవాన్ మూవీ లో నటించి బాలీవుడ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియమణి ఈ మూవీ తో హిందీ సినీ పరిశ్రమలో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఇకపోతే ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈయన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Adg

సంబంధిత వార్తలు: