గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో తన సత్తా ఏంటో చూపించి.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు తారక్.ఇంకా ఇప్పుడు అందరి ఎదురుచూపులు తారక్ నటిస్తున్న వార్, దేవర చిత్రాల మీదే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు వస్తున్న క్రమంలో.. తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఇండస్ట్రీలో ఒకరికి ఒకరు బంధుత్వాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఓ స్టార్ హీరో తారక్ కు బంధువట. ఎవరో చూసేద్దాం.ఆ హీరో మరెవరో కాదు.. రామ్ పోతినేని.అవును రామ్ పోతినేని, ఎన్టీఆర్ బంధువులు.. ఇదే విషయాన్ని రామ్ ఓ వేదిక పై స్వయంగా తెలిపాడు. గతంలో ఓ వేదిక పై రామ్ పోతినేని మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నాకు వరసకు అన్నయ్య అవుతాడు అని తెలిపాడు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులు, రామ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు ఈ విషయం మనకు తెలియలేదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో ఓ వేదికపై రామ్ పోతినేని మాట్లాడుతూ ఎన్టీఆర్ తనకు వరుసకు అన్నయ్య అవుతాడు అని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియోనే వైరలవుతోంది. ఇది తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు, రామ్ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లుగా ఈ విషయం మనకు తెలియలేదే అని ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం రాం పోతినేని ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాపై మంచి హైప్స్ ఏర్పడ్డాయి. గత ఏడాది స్కంద మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన రాం పోతినేని భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. అందువల్లే ఈసారి పక్కా ప్లానింగ్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు.ఇక తారక్ సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 10 న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ దద్దరిల్లబోతున్నాయి. దేవర సినిమా మొదటి పార్ట్ ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుందన్న విషయాన్నీ.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ పనులు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఆ పనులను పూర్తి చేసుకుని.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు కొరటాల శివ. రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ పార్ట్ -2 లో బిజీగా ఉన్నాడు. ఇక తారక్ ను స్క్రీన్ మీద చూసి చాలా రోజులు గడిచిపోయింది కాబట్టి.. తారక్ అభిమానులంతా దేవర రిలీజ్ డేట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మరి తారక్ , రామ్ పోతినేని బంధువులని వినిపిస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .