"బాక్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా తాజాగా "అరుణ్మనై 4" అనే తమిళ మూవీలో ప్రధాన పాత్రలలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన 3 మూవీ లు వచ్చాయి. అవి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించాయి. ఈ సిరీస్ లోని మూవీ లు తెలుగు లో వేరు వేరు పేర్లతో విడుదల అయ్యాయి. ఇది ఇలా ఉంటే "అరుణ్మనై 4" సినిమా కూడా తెలుగు లో విడుదల కానుంది.
 

ఈ సినిమా తెలుగు లో "బాక్" అనే పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని తమన్నా , రాశి ఖన్నా క్యారెక్టర్ పోస్టర్ లను కూడా విడుదల చేశారు. ఈ మూవీ లో తమన్నా ... శివాని పాత్రలో కనిపించనుండగా రాశి కన్నా ... మాయ పాత్రలో కనిపించబోతుంది. రాశి కన్నా ఇప్పటికే "అరుణ్మనై 3" లో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం వరకు ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ సినిమాను ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త విడుదల తేదీని మరికొన్ని రోజుల్లోనే ప్రకటిస్తామని ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాని మే 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బృందం నుండి ఈ సినిమాకు (యూ / ఏ) సర్టిఫికెట్ లభించింది. ఆ విషయాన్ని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: