ఓటిటి లోకి వచ్చేసిన గోపీచంద్ భీమ..!?

Anilkumar
మ్యాచ్ స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా భీమ. ఫాంటసీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కింది. కాగా ఈ సినిమాలో గోపీచంద్ తోపాటు మాళవిక శర్మ ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారు. వారితోపాటు నరేష్ వెన్నెల కిషోర్ పూర్ణ రఘుబాబు నాజర్ వంటి వారు కీలకపాత్రలో కనిపించారు.  కాగా ఈ సినిమాలో గోపీచంద్ బీమా రామా అనే రెండు పాత్రల్లో నటించాడు. ఇకపోతే మొదటి నుండి టీజర్ ట్రైలర్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా మార్చ్ 8 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఊహించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

అయితే చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నా గోపీచంద్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడు అని అనుకున్నాడు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా కూడా నిరాశనే మిగిలించింది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ గత రాత్రి అంటే ఏప్రిల్ 25 నుండి ఈ సినిమా ఓటీటీ లోకి అందుబాటులోకి రాబోతోంది.

 కాగా ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఒక వీడియో షేర్ చేశాడు గోపీచంద్. ఏప్రిల్ 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తన స్ట్రీమింగ్ అవుతుందని.. చూడండి అంటూ ప్రేక్షకులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు. ఈ థియేటర్లలో దాదాపు రూ. 20కోట్ల లోపే గ్రాస్ కలెక్షన్స్ రాట్టింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ రూ. 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.  కథ విషయానికి వస్తే.. పరశురామ క్షేత్రం ఉండే మహేంద్రగిరి అనే ప్రాంతంలో భీమా కథ సాగుతుంది. ఆ ప్రాంతంలో అరాచకాలు చేసే ముఠాను ఎస్ఐ భీమా కట్టడి చేస్తాడు. పరుశురామ్ క్షేత్రం ఎందుకు మూతపడింది. మళ్లీ దానిని భీమా తెరిచాడా అనేది ఈ సినిమా..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: