మరో మల్టీప్లెక్స్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఎక్కడంటే..!?

Anilkumar
సినీ సెలబ్రిటీ లు బిజినెస్ లు చేయడం చాలా కామన్. కొందరు సినీ సెలబ్రిటీలు బయట వ్యాపారాలు చేస్తే మరికొందరు మాత్రం ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ లను చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు మాత్రం చాలా మంది సెలబ్రిటీలు ప్రొడక్షన్ హౌస్ ను ఎక్కువగా చేసేవారు. కానీ ప్రస్తుతం వారందరూ కూడా థియేటర్ల వైపు అడుగులు వేస్తున్నారు. మల్టీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తున్న ఈ తరుణంలో చాలామంది స్టార్స్ అందరూ కూడా ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా చిన్నచిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ లకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

దీంతో చాలామంది హీరోలు అందరూ కూడా మల్టీప్లెక్స్ లో పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. ఇక ఎందులో మొదటి వరుసలో మహేష్ బాబు ఉంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ ఎం బి పేరుతో హైదరాబాదులోని గచ్చిబౌలిలో మహేష్ బాబు మొదటిసారిగా మల్టీప్లెక్స్ ను స్టార్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. భారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ ఇప్పటికీ మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. అయితే తాజా గా ఇప్పుడు మహేష్ బాబు ఏ ఎమ్ బి ను విస్తరించే పనిలో భాగంగా ఇప్పుడు మరొక పట్టనంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

  హైదరాబాద్‌లో ఏషియన్‌ సంస్థలో కలిసి గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్‌ రన్‌ చేస్తున్న మహేష్‌ త్వరలోనే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో కూడా మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్నట్లు గతంలో వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మాత్రం మహేష్‌ ఏఎంబీని బెంగళూరుకు విస్తరించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించి ఏషియన్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.  త్వరలోనే ఈ మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.  ఇదిలా ఉంటే ఈ బిజినెస్‌లో మహేష్‌తో పాటు ఇతర హీరోలు కూడా ఉన్నారు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ మహబూబ్‌ నగర్‌లో ఒక మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్‌ అమీర్‌పేట్‌లో AAA స్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: