తన టాటూ వెనుక రహస్యం అదే.. ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన ఫరియా?

praveen
నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణంగా మనిషి తన జీవన శైలి మార్చుకోవడానికి ఎక్కడ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. తినే ఆహారం దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇక మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. అచ్చం ఇలాగే అన్ని అలవాట్ల లాగానే నేటి రోజుల్లో టాటూ వేసుకునే అలవాటు కూడా ప్రతి ఒక్కరికి కామన్ గా మారిపోయింది. ఇక ట్రెండింగ్ తగ్గట్టుగా టాటూ వేసుకుంటే అదేదో గౌరవంగా ఫీల్ అవుతూ ఉన్నారు అందరూ. దీంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి మరి ఇష్టమైన టాటూలు వేయించుకోవడం కూడా చూస్తూ ఉన్నాం.

అయితే ఇలా ట్రెండ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారబోయేది ఎవరు అంటే సినీ సెలెబ్రిటీలు అని చెప్పాలి. దీంతో ఇక సెలబ్రిటీలు వేయించుకునే టాటూలు కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంటాయ్.. ఏకంగా కొంతమంది బాడీలోని ప్రైవేట్ పార్ట్ లపై టాటూ వేయించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఇక ఏదో  అర్థం వచ్చేలాగాని టాటూలు వేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం. ఇలా సెలబ్రిటీలకి సంబంధించిన టాటూ ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది వైరల్ గా మారిపోతూ ఉంటుంది . ఇప్పుడు ఒక టాలీవుడ్ హీరోయిన్ టాటూ పై కూడా సోషల్ మీడియాలో ఇలాగే చర్చ జరుగుతుంది.

 సెలబ్రిటీలు తమ శరీరంపై వేసుకునే టాటూలు వెనక ఎన్నో కారణాలు అర్థాలు ఉన్నట్లుగానే హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన కాలుకు వేసుకున్న టాటూ వెనుక ఒక అర్థం ఉందట. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తన కాలిపై ఉన్న టాటూ వేర్లను సూచిస్తుందట. వేర్లు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం అంత ఎత్తుకి ఎగదగలం. మనం ఎంత స్థాయిలో ఉన్నా నేలని మరువద్దు అనే విషయాన్ని ఈ టాటూ నాకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది ఫరియా అబ్దుల్లా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: