"టైగర్ నాగేశ్వరరావు" కి హిందీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కొంత కాలం క్రితం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి నుపుర్ సనన్ , గాయత్రీ భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించగా ... వంశీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రేణు దేశాయ్ , నాజర్ , అనుపమ కేర్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విపలం అయ్యింది. ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త విఫలం అయినప్పటికీ ఈ సినిమాలో రవితేజ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా ధియేటర్ రిలీజ్ సమయంలో హిందీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా హిందీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తోంది. ఈ మూవీ ని హిందీ వెర్షన్ ను కొన్ని రోజుల క్రితమే యూట్యూబ్ లో విడుదల చేశారు.

ఈ సినిమా యూట్యూబ్ లో విడుదల అయినా చాలా తక్కువ రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇలా థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో కాస్త విఫలం అయిన ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం హిందీ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ... అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: