"ఓం బీమ్ బుష్" ద్వారా శ్రీ విష్ణుకు మరో హిట్ దక్కిందా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో "ఓం భీమ్ బుష్" అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీసర్ ఇప్పటికే క్లోజ్ అయ్యింది. మరి ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వరల్డ్ వైడ్ గా వచ్చాయి. ఈ మూవీ ద్వారా శ్రీ విష్ణుకు ఎలాంటి విజయం దక్కింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 3.84 కోట్లు కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 3.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.50 కోట్ల షేర్ ... 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 2.30 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు విడుదల ప్రపంచ వ్యాప్తంగా 9.80 కోట్ల షేర్ ... 19 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమా దాదాపు వరల్డ్ వైడ్ గా 9.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఆల్మోస్ట్ బ్రేక్ ఇవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv

సంబంధిత వార్తలు: