తమిళ స్టార్ హీరో విజయ్ పై కేసు?

Purushottham Vinay
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా లోక్ సభ ఎన్నికల సందడి నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మొదటి దశ పోలింగ్  పూర్తయ్యింది. ఇందులో భాగంగా ఈ నెల 19 వ తేదీన తమిళనాడులో కూడా మొదటి విడత పోలింగ్ జరిగింది.ఈ సందర్భంగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ హీరోలంతా కూడా దాదాపుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి వారి అభిమానులను కూడా అలర్ట్ చేశారు.ఓటు వేయడం ప్రతీ ఆ హక్కు ఉన్న ప్రతీ పౌరుడి బాధ్యత అని తమ అభిమానులకి గుర్తు చేశారు. ఇదే క్రమంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఓటు వేయడం జరిగింది. అయితే ఓటు వేసే ఆ క్రమంలో... హీరో విజయ్ వల్ల తమకు ఇబ్బంది కలిగిందని ఒక సామాజిక కార్యకర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం తెలుస్తుంది. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతోంది.


తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు, తదనుగుణంగా భారీ ఫాలోయింగ్ ఉన్న దళపతి విజయ్... కొన్ని నెలల క్రితం "తమిళ వెట్రి కళగం" పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే... 2026 అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే తమ లక్ష్యం అంటూ తాజా లోక్ సభ ఎన్నికల్లో పోటీపై మాత్రం అంత ఆసక్తి చూపలేదు. ఇదే క్రమంలో.. ఏ పార్టీకీ కూడా విజయ్ మద్దతు ప్రకటించలేదు.ఈ నేపథ్యంలో ఈ నెల 19 వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. రష్యాలో తన సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరీ చెన్నై వచ్చిన విజయ్... స్థానిక నీలాంగరై పోలింగ్‌ బూత్‌ లో తన ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. అయితే ఇక ఈ సమయంలో విజయ్ తో పాటు ఆ బూత్ కి మందీ మార్భలం కూడా రావడం చర్చకు దారి తీసింది. ఇక ఇలా విజయ్‌ తో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు సుమారు 200 మందికి పైగా ఒకే సారి పోలింగ్‌ బూత్‌ కు రావడంతో అక్కడ సాధారణ ఓటర్లు చాలా ఇబ్బందులకు గురయ్యారని సమాచారం తెలుస్తోంది. అందుకే ఓ వ్యక్తి.. చైన్నె పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: