అవకాశం రావాలంటే ఆ పని చేయాల్సిందే.. కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్?

praveen
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ ఉందా.. ఇదే విషయంపై ఎన్నో ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నామని అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి.. వాడుకొని వదిలేసారు అంటూ కొంతమంది నటీమణులు ఏకంగా రోడ్డెక్కి నిరసనలు చేయడం కూడా గతంలో సంచలనంగా మారిపోయింది. అయితే ఒకప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎవరు పెద్దగా బయటికి మాట్లాడే వారు కాదు. ఒకవేళ ఏదైనా బయటికి మాట్లాడితే తమ కెరియర్ పాడవుతుంది ఏమో అని భయపడేవారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎంతో మంది సెలెబ్రిటీలు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఓపెన్ అవుతున్నారు.

 అవకాశాలు రావాలి అంటే పక్కలోకి వెళ్లాల్సిందే అంటూ కొంతమంది నటీమణులు బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఉంటే.. తమకు మాత్రం అలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు అంటూ ఇంకొంతమంది నటీమణులు చెబుతూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవల సీనియర్ నటి, గృహలక్ష్మి సీరియల్ ప్రేమ్ కస్తూరి శంకర్ సైతం క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ చెప్పుకొచ్చిన కస్తూరి శంకర్.. తనకు కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా పంచుకున్నారు.

 ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురవుతూనే ఉంటుంది. కానీ చాలామంది ఒప్పుకోరు అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెప్తున్నారు. ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయి ఈ కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ని  ఫేస్ చేయాల్సిందే. నా కెరియర్ లోను క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఉన్నాయి. నేను ఒప్పుకోలేదని చాలా సినిమాల్లో నుంచి తీసేశారు  కొన్ని ఎపిసోడ్స్  లేపేసారు. కానీ అదృష్టం కొద్దీ తెలుగు వాళ్ళ నుంచి అలాంటి అనుభవం ఎదురు కాలేదు. మలయాళం లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేసారు. ఇదే తన కెరీర్ లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ తెలిపింది కస్తూరి శంకర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: