మంచు విష్ణు కన్నప్ప సినిమాలో మరో స్టార్ హీరోయిన్..!?

Anilkumar
ఒక్కటంటే కేవలం ఒక్కటే హిట్టు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు. అయితే ఈ క్రమంలోనే మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తో ఎలాగైనా సరే భారీ విజయని అందుకోవాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఇండియా లెవెల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది పెద్దపెద్ద స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా కోసం సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి

 అన్న వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరొకవైపు ఈ సినిమాలో మరొక కీలక పాత్రలో కిలాడి అక్షయ్ కుమార్ సైతం కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన ఈ సినిమాలో మహాదేవుడి పాత్రలో కనిపించనున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇటీవల ఓ మై గాడ్ టు సినిమాలో పరమేశ్వరుడు పాత్రలో మెప్పించాడు అక్షయ్ కుమార్. ఇక ఈ సినిమాలో కూడా అదే పాత్రలో నటిస్తాడా లేదా మరితర పాత్రలో నటిస్తాడా అన్నది మాత్రం ఇంకా తెలియదు. ఇదిలా ఉంటే మరొకవైపు ప్రభాస్ సైతం ఇందులో

మహా శివుడి పాత్రలో కనిపించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే అప్పట్లో మంచు విష్ణు సైతం హర హర మహాదేవ అంటూ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా షేర్ చేశాడు. దీంతో ప్రభాస్  ఈ సినిమాలో ఏ పాత్రలో నటిస్తాడు అన్న కన్ఫ్యూజన్ మొదలైంది. మరోవైపు ఈ సినిమాలో పార్వతి మాత పాత్రలో ముందుగా నయనతారను అనుకున్నారు. మరోవైపు కంగనా, అనుష్క శెట్టి పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ నటించబోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: