షూటింగ్లో కింద పడితే.. నా బ్రెయిన్ దెబ్బతినింది : హీరోయిన్

praveen
సాధారణంగా సినిమా హీరో హీరోయిన్ల లైఫ్ ఎంతో లగ్జరీగా ఉంటుందని మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. కేవలం సినిమాలో నటించినందుకు కోట్ల రూపాయల పారితోషకం అందుతుంది. ఇక లైఫ్ అంటే సినిమా వాళ్ళది.. ఒకవైపు పేరుకు పేరు ఇంకో వైపు డబ్బులకు డబ్బులు వస్తాయి.  ఎంతైనా పెట్టి పుట్టారు. అదృష్టవంతులు అంటూ ఆడియన్స్  అనుకుంటూ ఉంటారు  కానీ
 సినిమా నటుల జీవితం తెరమీద కనిపించినంత అందంగా ఆనందంగా ఉండదు అని కొన్ని కొన్ని విషయాలు బయటకు వచ్చినప్పుడు అందరికీ అర్థం అవుతూ ఉంటుంది.

 ఎంతోమంది హీరో హీరోయిన్లు సినిమాల్లో నటించే కొన్ని సన్నివేశాల కోసం ఏకంగా ప్రాణాలను ప్రాణంగా పెట్టినటించడం కూడా చేస్తూ ఉంటారు  ఇక ఈ మధ్యకాలంలో అయితే సినిమాల కోసం ఇలాంటి సాహసాలు చేసే నటీనటులు కాస్త ఎక్కువైపోయారు. కొంతమంది అయితే రిస్కీ విన్యాసాలను సైతం ఎలాంటి డూప్ లేకుండా చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతూ ఇక చివరికి గాయాల బారిన పడి ఆస్పత్రి పాలు అవుతూ ఉంటారు సినీ సెలబ్రిటీలు. అయితే ఇక్కడ ఒక బాలీవుడ్ హీరోయిన్ తన లైఫ్ లో జరిగిన ఇలాంటి ఒక ప్రమాదం గురించే ఇటీవల అభిమానులతో పంచుకుంది.

 ఒక సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను కింద పడిపోవడంతో తన బ్రెయిన్ దెబ్బతింది అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ తానీషా ముఖర్జీ. తన మొదటి సినిమా షూటింగ్లో కొండమీద నుంచి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది అంటూ వెల్లడించింది. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ అయిందని డాక్టర్లు తెలిపారు. ఇలా గాయం బాధతోనే షూటింగ్ పూర్తి చేశాను. రెండు గంటలు షూటింగ్ చేస్తే మూడు గంటలు పడుకునేదాన్ని. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది అంటూ తానీషా ముఖర్జీ చెప్పుకొచ్చింది. ఈమె తెలుగులో తారక్ సరసన కంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: