"దేవర" మూవీకి మొత్తంగా జరిగిన బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడం ... ఈ మూవీ లో ఎన్టీఆర్ హీరో గా నటించడం , బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా కనిపించనుండడం , అలాగే సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ గా చేస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి.

అలాగే ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుండడంతో ఈ సినిమాలో చాలా స్టాఫ్ ఉంది అందుకనే ఈ సినిమాను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు అని చాలా మంది ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ మరియు నాన్ థియేటర్ , ఆడియో రైట్స్ , సాటిలైట్ రైట్స్ అంటూ అనేక రకాలుగా భారీ మొత్తంలో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరి మొత్తంగా ఈ సినిమాకు ఎన్ని కోట్ల బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దేవర థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ హక్కులు అన్నీ కలుపుకొని ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరుపుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు ,  "ఓ టి టి" హక్కులకు గాను ఈ మూవీ కి 270 కోట్లకి పైగానే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మిగతా భాషలు , ఓవర్ సీస్ సహా ఆడియో అన్నీ కలిపి ఈజీగా 130 కోట్లు ఉంటుంది అని ఓ టాక్. ఇలా మొత్తంగా దేవర మూవీ కి అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: