టిల్లు స్క్వేర్ కి ఇప్పటివరకు ఏకంగా ఎన్ని కోట్ల లాభలా..?

Pulgam Srinivas
డిజే టిల్లు మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ తాజాగా టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 19 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. అలాగే ఇప్పటివరకు ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను కూడా తెలుసుకుందాం.
ఈ మూవీ కి 19 రోజుల్లో నైజాం ఏరియాలో 25.84 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 5.23 కోట్లు ... ఉత్తరాంధ్రలో 5.67 కోట్లు ... ఈస్ట్ లో 2.94 కోట్లు ... వెస్ట్ లో 1.84 కోట్లు , గుంటూరు లో 2.61 కోట్లు .... కృష్ణ లో 2.34 కోట్లు ... నెల్లూరు లో 1.48 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 19 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 47.95 కోట్ల షేర్ ... 80.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి 19 రోజుల్లో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 4.35 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 14.92 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.23 కోట్ల షేర్ ... 119.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 39.22 కోట్ల భారీ లాభాలను అందుకొని బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: