రిలీజ్ కాకముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న పుష్ప 2..!?

Anilkumar
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి మనందరికి తెలిసిందే.  ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా భారీగా కాసుల వర్షం కూడా కురిపించింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే సినిమా విడుదల కూడా కాకముందే

అన్ని రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం వినబడుతోంది. అంతేకాదు విడుదలకు ముందే ఈ సినిమా 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్ప త్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఈ సినిమా మొదట 100 కోట్ల రూపాయల బిజినెస్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. దానితో టికెట్ ధరలు కూడా పెరిగిపోయాయి. అయితే 2023లో షారుక్ ఖాన్ నటించిన రెండు సినిమాలు విడుదలై 1000 కోట్ల రూపాయలను వసూలు చేశాయి.

కానీ ఇప్పుడు మాత్రం పుష్పా టూ సినిమా విడుదల కాకముందే 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దాంతో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లకు చేరుకున్నట్లు గా సమాచారం. ఆంధ్ర, తెలంగాణ భాగాల పంపిణీ హక్కులు 200 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ హిందీలో పెద్ద హిట్ అయ్యింది. దాంతో పార్ట్‌2 కు కూడా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీవీ రైట్స్, ఓటీటీ రైట్స్, సాంగ్ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోవడంతో బిజినెస్ 1000 కోట్ల రూపాయలను దాటేసిందని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: