ఓటిటి స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న టిల్లు స్క్వేర్.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్దు జొన్నలగడ్డ టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్ సుమారు రెండేళ్ల క్రితం చాలా చిన్న సినిమాగా వచ్చి సంచలనాన్ని సృష్టించిన డీజేటిల్లు సినిమాకి సీక్వల్ గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. ఇకపోతే డీజే టిల్లు సినిమాలో హీరోయిన్గా నటించిన నేహా శెట్టి అలియాస్ రాధిక సైతం ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది. ఇక ఈ సినిమాతో నేహా శెట్టి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఈ వరుస సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. 29న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 100 కోట్లకు పైగా నే వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చింది. ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు థియేటర్స్ లో సినిమాని చూడడం మిస్సయిన సినీ లవర్స్ అందరూ కూడా ఈ సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ తాజాగా దానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా

 నెట్ ఫ్లెక్స్ సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. అయితే మొదట ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ఓటీటీ లోకి విడుదల చేస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ థియేటర్స్ లో ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విషయాన్ని అందుకోవడంతో ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మే 3 లేకపోతే  నాలుగవ వారంలో ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందో తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: