"విశ్వంబర" సెట్స్ లో చిరుతో టాలీవుడ్ డైరెక్టర్స్..!

MADDIBOINA AJAY KUMAR
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బింబిసారా ఫేమ్ మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఇషా చావ్లా , సురభి , చిరు కు చెల్లెల పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు కూడా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ ఫుల్ స్పోడ్ గా జరుగుతుంది. ప్రస్తుతం కూడా ఈ చిత్ర షెడ్యూల్ కొనసాగుతుంది.  ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో చిరంజీవి కూడా పాల్గొంటున్నాడు. ఇకపోతే తాజాగా చిరంజీవి "విశ్వంబర" సినిమా షూటింగ్ స్పాట్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన కొంత మంది డైరెక్టర్ లు వచ్చి చిరంజీవి ని కలిశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుడుంబా శంకర్ మూవీ దర్శకుడు వీర శంకర్ గత కొన్నాళ్ల కితమే తెలుగు సినిమా దర్శకుల ప్రెసిడెంట్ గా ఎంపిక అయిన సంగతి మనకు తెలిసిందే.

మరి తాజాగా మెగాస్టార్ ని వీర శంకర్ సహా అనేక మంది యువ దర్శకులు సహా సీనియర్ దర్శకులు కూడా కలవడం జరిగింది. ఇక తాజాగా విశ్వంభర మూవీ సెట్స్ లో భోళా శంకర్ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ , జాతి రత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ కె వి , గుడుంబా శంకర్ మూవీ డైరెక్టర్ వీర శంకర్ మరి కొంత మంది చిరంజీవి ని కలవడ జరిగింది. వీరంతా కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర మూవీ యూనిట్ ప్రస్తుతం చిరంజీవి పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: