నాని సినిమాలో మిస్టర్ బచ్చన్ బ్యూటీ..!

shami
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నరు. ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కూడా డివివి దానయ్య నిర్మాణంలోనే వస్తుంది. రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని డివివి దానయ్యతో క్రేజీ డీల్ సెట్ చేసుకున్నారని తెలుస్తుంది. నాని 31వ సినిమాగా వస్తున్న సుజిత్ డైరెక్షన్ మూవీలో హీరోయిన్ గా ఎవరెవరినో అనుకుని ఫైనల్ గా మిస్టర్ బచ్చన్ భామని ఫిక్స్ చేశారట.
సుజిత్ నాని కాంబో సినిమాలో ముందు బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా తీసుకుంటారని ప్రచారం జరిగింది. తెలుగులో చేతిలో ఒక్క సినిమా లేక పూజా హెగ్దే డీలా పడింది. అయితే నాని సినిమాలో ఛాన్స్ ఆమెకు బూస్టింగ్ ఇస్తుందని అనుకున్నారు. కానీ సినిమా ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది. మాస్ మహరాజ్ రవితేజ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్య శ్రీ బోర్స్ కు ఈ ఛాన్స్ వరించిందని తెలుస్తుంది.
బాలీఎవుడ్ లో యారియాన్ 2 సినిమా లో నటించిన భాగ్య శ్రీ హరీష్ శంకర్ దృష్టిలో పడింది. రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా లో హీరోయిన్ గా చేస్తున్న భాగ్య శ్రీ ఆ సినిమా పూర్తి కాకుండానే నాని సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. నాని సినిమాలో హీరోయిన్స్ కు కూడా మంచి బలం ఉంటుంది. మరి భాగ్య శ్రీకి అలాంటి ఛాన్స్ వచ్చింది అంటే అది మామూలు విషయం కాదు. భాగ్య శ్రీ చూస్తుంటే తెలుగులో కొన్నాళ్లు బాగా వినిపించే పేరులా ఉందనిపిస్తుంది. రవితేజ తో మిస్టర్ బచ్చన్ నాని31 సినిమాలతో తెలుగులో అదరగొట్టే క్రేజ్ ఏర్పరచుకుంటుంది అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: