చివరికి.. నన్ను కమెడియన్ ను చేసి పారేశారు : పుష్ప విలన్

praveen
ఫహద్ ఫాజీల్.. ఈ నటుడు గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు   ఎందుకంటే.. నేటి తరంలో ఉన్న గొప్ప నటుల్లో ఈయన కూడా ఒకరు. ఎలాంటి పాత్రలో నటించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగల  సత్తా ఆయనలో ఉంది. అందుకే ఇక ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉంటాడు. సినీ ప్రేక్షకులను తన యాక్టింగ్ తో ఫిదా చేసి అభిమానులుగా మార్చుకుంటూ ఉంటాడు. ఒకవైపు మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతూ.. అక్కడ సినిమాలు చేస్తూనే ఇంకోవైపు సౌత్ ఇండియా లోని మిగతా భాషల్లో కూడా స్టార్ హీరోల సినిమాలో వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు.

 గతంలో ఉదయం ఇది స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన మామన్నన్ చిత్రంలో వీలనిజం పండించడం  ద్వారా ఎంతో మంది దర్శకులకు విలన్ గా ఫహద్ ఫాజీల్ ఒక మంచి ఆప్షన్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఇక మెయిన్ విలన్ గా ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ఉండబోతుందని అందరు అనుకుంటున్నారు.   మరోవైపు కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలోను కీలకపాత్రలో నటించి మెప్పించారు.

 అయితే ఇలా ఎన్నో సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించిన తనను చివరికి కమెడియన్ ను చేసి పారేశారు అంటూ ఇటీవల ఫహద్ ఫాజీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయ్యాన్ చిత్రంలో ఫహద్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఇందులో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ మూవీలో దర్శకుడు జ్ఞానవేల్ తనను కమెడియన్ గా మార్చాడు  కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ మూవీలో తనని హీరోగా పలువురు భావించారని.. అంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో నటించిన తనను..  జ్ఞానవేల్ మాత్రం రజినీ మూవీలో కమెడియన్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి దర్శకుడు వివరించిన తర్వాత వెంటనే నటించడానికి అంగీకరించాను అంటూ ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఈ మూవీ అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: