ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి 2898. ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. అత్యంత భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు డార్లింగ్ అభిమానులు. భారత పురాణాల స్ఫూర్తితో ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో తెరగెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశకి చేరుకుంది. అయితే ఈ సినిమాను మే నెల 9న విడుదల చేయాలి అని మూవీ టీం ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

కానీ ఎన్నికల కారణంగా ఆ సమయంలో సినిమా విడుదల కావడం కష్టమే అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తల పట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కారణంగా ఈ సినిమా మే 9న విడుదల అవ్వదు అన్న అంచనాలు నెలకొన్నాయి. మే 31 తేదీన ఈ సినిమా రావచ్చు అన్న వార్తలు కూడా వస్తున్నాయి.  ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి మరొక కొత్త తేదీ వచ్చింది. అది ఏంటంటే జూన్ 20న కల్కి సినిమా విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కల్కి 2898 ఏడీ సినిమా మే 30కు వాయిదా పడిందంటూ కొంతకాలంగా విపరీతంగా రూమర్లు వస్తుండగా.. ఇప్పుడు జూన్ 20 కూడా తెరపైకి వచ్చింది. మరి, మేకర్స్ ఏం డిసైడ్ చేస్తారో చూడాలి. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మూవీ టీమ్ త్వరలోనే అప్‍డేట్ ఇస్తుందని.. ఆ సమయంలోనే రిలీజ్ డేట్‍పై కూడా క్లారిటీ ఇస్తుందనే సమాచారం సినీ సర్కిల్‍లో చక్కర్లు కొడుతోంది. హీరో ప్రభాస్ ఈ చిత్రం కోసం తన షూటింగ్ ముగించుకొని ప్రస్తుతం యూరప్ టూర్‌కు వెళ్లారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: