HBD: అల్లు అర్జున్ సృష్టించిన రికార్డ్స్ ఇవే..!!

Divya
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పేరు సంపాదించారు.. ముఖ్యంగా తన స్టైల్, మేనరిజం, యాటిట్యూడ్, డాన్స్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్.. మొదట గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన బన్నీ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోగా ప్రశంసలు అందుకున్నారు.. హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్న సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న అల్లు అర్జున్ ఇప్పుడు శభాష్ అనిపించుకుంటున్నారు.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించారు.

ఈ రోజున అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఈ వేడుకను చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు బర్తడే విషెస్ తెలుపుతున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో  సాధించిన రికార్డుల విషయానికి వస్తే..
1).ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్..
2).2003 లో మొదటి చిత్రం గంగోత్రితో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న హీరోగా పేరు సంపాదించారు.

3). కేరళలో అత్యధికంగా తెలుగు హీరోకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బన్నీ పేరు సంపాదించారు. ముద్దుగా అక్కడ అల్లు అర్జున్ ని మల్లు అర్జునుని పిలుచుకుంటారు.
4). ఇన్స్టా త్రెడ్స్ యాప్ లో ఒక్కో పోస్టుకి 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకుంటున్న మొదటి హీరోగా బన్నీ పేరు ఉంది.

5). ఇన్స్టాల్ డాక్యుమెంటరీ వీడియోస్ చేసిన మొట్టమొదటి హీరోగా పేరుపొందారు. ఇందులో అల్లు అర్జున్ సెట్స్ తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ కూడా చూపించారు.

6). పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించడమే కాకుండా ఆడియో ఆల్బమ్స్ తో కూడా యూట్యూబ్లో 5 బిలియన్స్ వ్యూస్ నీ దాటారు.

7). దుబాయిలో మేడమ్ టుసాడ్స్ లో మైనపు విగ్రహం చేసిన ఏకైక హీరోగా పేరుపొందారు.
8). దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న ఫస్ట్ తెలుగు హీరోగా పేరు సంపాదించారు.
9). ఇంస్టాగ్రామ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ కు 25.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: