"హాయ్ నాన్న" మూవీకి మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని పోయిన సంవత్సరం చివరలో హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది. ఇలా థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం అయ్యింది. ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ సంస్థ వారు ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయగా ఈ మూవీ మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు 4.45 "టి ఆర్ పి" రేటింగ్ ను తెచ్చుకుంది. థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమాకు మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు వచ్చిన ఈ "టి ఆర్ పి" రేటింగ్ కాస్త తక్కువే అని చెప్పవచ్చు. ఇకపోతే నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: