విడాకులు తీసుకున్నాం.. కానీ ఇంకా మా మధ్య ప్రేమ ఉంది : హీరోయిన్

praveen
ఒకప్పుడు సినీ సెలబ్రిటీల గురించి పెద్దగా విషయాలు బయటకు వచ్చేవి కాదు. అయితే కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే అందరికీ తెలిసేవి. ఇక పర్సనల్ విషయాలను ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతూ ఉండేవారు సెలబ్రిటీలు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సోషల్ మీడియా కారణంగా ఏకంగా అభిమానులకు సినీ సెలబ్రిటీలకు మధ్య ఉన్న దూరం పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో ఇక పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకోవడానికి సెలబ్రిటీలు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు.

 తమ లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాల గురించి ఫ్యాన్స్ తో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా సెలబ్రిటీలు చెప్పే ఎన్నో విషయాలు అప్పుడప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారిపోయాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు ఎన్నో ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ  చివరికి విడాకులు తీసుకొని విడిపోవడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రస్తుతం విడాకులు తీసుకొని వేరుగా జీవనం సాగిస్తున్న.. మంచి స్నేహితులుగానే మెలుగుతూ ఉంటారు.

 ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ తో ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అన్న విషయాన్ని చెప్పుకొచ్చింది కిరణ్ రావు. ఎంతో ఆలోచించిన తర్వాత అమీర్ నుంచి విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. విడాకుల విషయంలో నేను భయపడలేదు. ఏకాంతం కావాలని.. స్వతంత్రంగా జీవించాలని అనుకున్నాను. ఇక స్వతహాగా ఎదగాలని భావించాను. నా ఆలోచనలను అమీర్ కి చెబితే అతను కూడా గౌరవించాడు. తర్వాత విడాకులు తీసుకున్నాం అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న మా మధ్య ప్రేమాభిమానాలు తగ్గలేదు అంటూ తెలిపింది. కాగా 2005లో వీరికి పెళ్లి జరగగా 2021 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: