నటుడుగా మారిన అశ్విన్.. ఆ సినిమాలో అతిథి పాత్ర?

praveen
సాధారణంగా క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఏం చేస్తారూ.. ఏదో ఒక విధంగా క్రికెట్కు దగ్గరగా ఉండే పనులు చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక జట్టుకి కోచ్ గా మారిపోవడమో.. లేదంటే వ్యాఖ్యాతగా మారి తమ గాత్రంతో క్రికెట్ మ్యాచ్లను ఉత్కంఠ భరితంగా మార్చి ప్రేక్షకులను అలరించడమో చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు భారత క్రికెట్లో రిటైర్మెంట్ ప్రకటించిన ఎంతో మంది ప్లేయర్లు ఇదే చేస్తూ ఉన్నారు. కూడా కానీ ఈ మధ్యకాలంలో మాత్రం క్రికెటర్లు అందరిలా కాకుండా కొత్తగా ఆలోచిస్తున్నారు. క్రికెట్కు ఎక్కడ సంబంధం లేని కొత్త ఫీల్డ్ లోకి అడుగు పెడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటికే యాక్టర్ గా అవతారం ఎత్తాడు. ఒకవైపు క్రికెట్ కెరీర్ను కొనసాగిస్తూనే.. ఇంకోవైపు నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇంకో వైపు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఏకంగా ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి సినిమాలను నిర్మించడం లాంటివి కూడా చేస్తూ ఉన్నాడు. ఇక ఒక స్టార్ హీరో సినిమాలో అతిథి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయ్. ఇక ఇప్పుడు మరో స్టార్ క్రికెటర్ ఇలా నటుడిగా అవతారం ఎత్తబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 ఇలా ఈ మధ్యకాలంలో సినిమాల్లో క్రికెటర్లు నటించడం సర్వసాధారణంగా మారిపోయింది. శ్రీశాంత్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, శిఖర్ ధావన్ లాంటివారు ఇప్పటికే కొన్ని చిత్రాల్లో కనిపించారు.  ఇక ఇప్పుడు ఏకంగా టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నటుడుగా మారబోతున్నాడట. ఐశ్వర్య రాజేష్, జీవి ప్రకాష్ జంటగా నటిస్తున్న డియర్ అనే మూవీలో అశ్విన్ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. కాగా ఈ సినిమా ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: