ఆ కారణంగా బాలయ్యతో సినిమా చెయ్యని యంగ్ టైగర్....!!
జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదట ప్రకటించిన విధంగా విడుదలై ఉంటే ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్ల లో విడుదలై ఉండేది. ఈ సినిమా ప్రైమ్ డేట్ ను మిస్ చేసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. అయితే దసరా పండుగ కూడా మంచి సీజన్ల లో ఒకటి. గతేడాది బాలయ్య దసరా కానుకగా భగవంత్ కేసరి సినిమా ను రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఈ ఏడాది దేవర కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మంచి లాభాలను అందుకుంటుందేమో చూడాలి. దేవర సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా భాగస్వామిగా ఉంది. దేవర సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా త్వరలో రిలీజ్ కానున్న టీజర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ అంత కంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.