త్వరలో కీరవాణి కొడుకు పెళ్లి..?

Divya
సినీ ఇండస్ట్రీలో ఉండేవారు సినిమా కుటుంబాలతోనే సంబంధాలు కలుపుకకోవడం కొత్తేమి కాదు.. కలిసి నటించిన వాళ్లు పెళ్లి చేసుకోవడమే కాకుండా.. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇలాంటి విషయంలో అక్కడక్కడ వినిపిస్తూ ఉంటారు.. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహ (హీరో).. సీనియర్ హీరో మురళీమోహన్ మనవరాలను వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది .అయితే దీని గురించి ఇప్పటిదాకా ఇద్దరు కుటుంబ సభ్యులు ఎక్కడ స్పందించలేదు.. అయితే ఇప్పుడు మురళీమోహన్ (కోడలు) వధువు తల్లి అయిన మాగంటి రూప ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు..


మురళీమోహన్ తో కలిసి ఆమె ఆలీ నిర్వహించిన ఆలీతో జాలీగా వంటి కార్యక్రమానికి పాల్గొనింది. ఈ సందర్భంగా మీ అబ్బాయికి ఇండస్ట్రీకి చెందిన అబ్బాయితో వివాహం చేస్తున్నారట నిజమేనా అని ఆలీ గారు అడగగా.. అందుకు రూప కూడా బదిలీస్తూ.. అవును నిజమే సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహతో మా అమ్మాయి వివాహం నిశ్చయమైందంటూ తెలిపిందట. ఏడాది చివరిలో వీరి వివాహం ఉండవచ్చు అంటూ ఆమె వెల్లడించింది..

కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా వివాహం కాలేదు.. అంతలోపే చిన్నబ్బాయికి పెళ్లి కుదరడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా ఇది ప్రేమ పెళ్లి కావచ్చు అంటూ పలువురి నేటిజన్స్ తెలుపుతున్నారు.. మత్తు వదలరా అనే డిఫరెంట్ సినిమాతో శ్రీ సింహ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా భారీ సక్సెస్ను అందుకుంది.అయితే ఈ సినిమా తర్వాత శ్రీ సింహా కెరియర్ ఒకసారిగా తలకిందులైంది.. తాను నటించిన చిత్రాలు తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ వంటి సినిమాలు ఫెయిల్యూర్ గాని మిగిలిపోయాయి. దీంతో తన తదుపరి కొత్త సినిమాలను అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు శ్రీ సింహ.. మరి ఈ విషయం పైన కీరవాణి కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: