నేను పెళ్ళి చేసుకున్నా.. మాజీ లవర్ ను కలుస్తూనే ఉంటా : హీరోయిన్

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. అందుకే ఇక ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయం తెల మీదికి వచ్చినా కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సెలబ్రిటీల రిలేషన్షిప్స్ ప్రేమ వ్యవహారాలు అయితే ఇక ఇంటర్నెట్ ను ఊపేస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడూ తన రిలేషన్ షిప్స్ తో వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండేది సుస్మితసేన్.  ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపును సంపాదించుకుంది.

 అయితే కేవలం సినిమాలతోనే కాదు తన ఎఫైర్లతో కూడా వార్తల్లో అంతే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉండేది. ఇప్పటివరకు ఇక ఎంతోమందితో డేటింగ్ లో మునిగితేలిన ఈ ముద్దుగుమ్మ ఇక 48 ఏళ్ళ వయసు దాటిపోతున్న ఇంకా సింగిల్గానే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పుడు సుస్మితసేన్ రిలేషన్షిప్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్.. తన రిలేషన్ షిప్స్ పై చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

 తన జీవితం తెరిచిన పుస్తకం అని నిజాయితీగా జీవిస్తున్నాను అంటూ మాజీ విశ్వసుందరి సుస్మితసేన్ చెప్పుకొచ్చింది. ఇక తన బ్రేకప్స్ పెళ్లిపై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనం తీసుకునే నిర్ణయాలు బాధ పెట్టాయా.. తప్పు చేశానా అన్న విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను. ఒకవేళ నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నా మాజీ లవర్ లతో ఇక ఫ్రెండ్లీ గానే ఉంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సుస్మితసేన్. కానీ అది కాస్త కష్టంగానే ఉంటుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయితే ఇక 48 ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి ఎప్పుడు అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: