ది గోట్ లైఫ్: నార్త్ అమెరికాలో రికార్డులు షేకింగ్?

Purushottham Vinay
మలయాళంలో బెస్ట్ సెల్లర్‌గా మారిన పుస్తకం ఆడు జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ది గోట్ లైఫ్. ప్రస్తుతం ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. గల్ఫ్ దేశాలకు వలస పోయిన మలయాల వ్యక్తి అక్కడ ఎలాంటి కష్టాలకు గురయ్యాడు అనే పాయింట్‌తో ఈ మూవీ మంచి ఎమోషనల్ జర్నీగా తెరకెక్కింది.నజీబ్ అనే బాధితుడి పాత్రను మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించారు. బ్లెస్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధిస్తున్నది. ఇప్పటిదాకా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా జోర్డాన్, ఇతర దేశాల్లో ఎడారి ప్రాంతంలో షూట్ చేశారు. అత్యంత ప్రతీకూల పరిస్థితుల్లో రూపొందిన ఈ సినిమాని సుమారుగా 13 ఏళ్ల పాటు షూట్ చేశారు. దాంతో ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది. పాత్రలు చాలా తక్కువైనప్పటీకి క్వాలిటీ పరంగా హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా రూపొందించడంతో ఈ సినిమాకి సుమారుగా 80 కోట్ల రూపాయలు బడ్జెట్ అయింది.ఇక ది గోట్ లైఫ్ మూవీకి ఉత్తర అమెరికాలో బ్రహ్మండమైన ఓపెనింగ్స్ వచ్చాయి.


తొలి రోజు 120K, 2వ రోజు 175K, 3వ రోజు 190K, 4వ రోజు 190K, 5వ రోజు 85 వేల డాలర్లు, ఆరో రోజు 71 వేల డాలర్లు, 7వ రోజు 50 వేల డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ రోజుతో కలిపి అమెరికాలో 900K డాలర్లు అంటే 8 కోట్ల రూపాయల మేర వసూలు చేసింది. ఇతర దేశాలతో కలుపుకొని ఈ సినిమా 41 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ లూసిఫర్, ప్రేమమ్, మంజుమేల్ బాయ్స్ తర్వాత ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఆరో మూవీగా రికార్డు సృష్టించింది.గోట్ ఆఫ్ లైఫ్ చిత్రం ఓవర్సీస్‌లో 41 కోట్ల రూపాయలు, ఇండియాలో  51 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇప్పటి దాకా వరల్డ్ వైడ్‌గా 92 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ఇంకా రెండు మూడు రోజుల్లో  ఖచ్చితంగా 100 కోట్ల మార్కు చేరేందుకు రెడీ అవుతున్నది.  ఈ సినిమా పృథ్వి రాజ్ సుకుమారన్ కెరీర్ లో ఖచ్చితంగా బెస్ట్ సినిమాగా నిలవడం ఖాయం అంటున్నారు. బుక్ మై షోలో ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: