వారెవ్వా.. సీతారామం బ్యూటీ మృనాల్ ఠాగూర్ కి.. బిగ్ ఆఫర్?

praveen
అప్పుడు వరకు కొంతమందికి మాత్రమే తెలిసిన హీరోయిన్ మృనాల్ ఠాగూర్.. సీతారామం అనే సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా అవతరించింది అన్న విషయం తెలిసిందే. క్లాసికల్ లవ్ స్టోరీ గా వచ్చిన సీతారామం మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సూపర్ హిట్టుగా నిలిచింది  సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఇక అక్కడ ఇక్కడ అని తేడా లేదు భాషతో సంబంధం లేకుండా అందరి మనసుకు దగ్గర అయింది మృనాల్ ఠాగూర్.  ఇక ఈ మూవీ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ ఏడాది ఇప్పటికే అటు నాని సరసన హీరోయిన్గా నటించి హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక తన నటనకు కూడా మంచి మార్కులు పట్టాయి. ఇక ప్రస్తుతం  రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించింది.  ఈ మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ క్రేజీ హీరోయిన్ కు ఇక ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అన్నది తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి చేయబోయే ఒక సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుందట మృణాల్ ఠాకూర్.

  బాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో వచ్చే సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఆయన సినిమాలను కళాఖండాలుగా విశ్లేషకులు అభివర్ణిస్తూ ఉంటారు. ఇక అలాంటి దర్శకుడు మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటే మృనాల్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయమని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: