అయలాన్ తెలుగు ఓటిటి వర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

Divya
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా చిత్రం ఆయలాన్.. ఇందులో హీరోయిన్గా రకుల్ ప్రీతిసింగ్ నటించింది. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.. ఈ ఏడాది తమిళనాడులో పొంగలి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలై అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు వర్షన్ ని జనవరి 26న గ్రాండ్గా విడుదల చేయవలసి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాని థియేటర్లో నుంచి తీసివేశారు.. తమిళ వర్షన్ ఫిబ్రవరి 9న సన్ నెక్స్ట్ లో రిలీజ్ అయింది.

ఆయలాన్ సినిమా తెలుగు వర్షన్ ఇప్పటివరకు ఎప్పుడు విడుదలవుతుందో అనే విషయం పైన క్లారిటీ రాలేదు.. తాజాగా తెలుగు స్ట్రిమింగ్ అప్డేట్ గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. ఏప్రిల్ 19న సన్ నెక్స్ట్ లో ప్రీమియర్ కాబోతుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. దీనిపైన చిత్ర బృందం  ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.. తమిళంలో థియేటర్లో విడుదల మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఒకవేళ తాజా అప్డేట్ ప్రకారం ఇది నిజమైతే.. అయలాన్ సినిమా చూసే అవకాశం ఉంటుంది.

అయలాన్ -2  కూడా త్వరలోనే తెరకెక్కించబోతున్నట్లు కేజేఆర్ స్టూడియోస్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటన కూడా చేశాయి.. సిపిఎల్ కోసం ప్రత్యేకించి 50 కోట్ల రూపాయల vfx ,cig పనుల కోసమే ఖర్చు పెట్టబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందుకోసం  కోసమే కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతున్నట్లు ప్రకటించడం జరిగింది చిత్ర బృందం.. ఈ సినిమా మ్యూజిక్ సెన్సేషనల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేశారు.. ఈ చిత్రంకి శివ కార్తికేయన్ రెమ్యూనికేషన్ తీసుకోకుండానే నటించినట్లుగా తెలుస్తోంది. రకుల్ ప్రీతిసింగ్ కూడా ఈ సినిమాతో మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం అయలాన్ చిత్రానికి సంబంధించి ఒక ట్విట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: