నా సక్సెస్ ని.. నేను ఎంజాయ్ చేయలేకపోయా : జగపతిబాబు

praveen
దాదాపు మూడు దశాబ్దాల కిందట జగపతిబాబు అంటే మ్యాన్లీ హీరో అని పేరు ఉంది. ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా జగపతిబాబు హీరోగా సినిమాలను చేస్తూ ఎన్నో సూపర్హిట్లను కూడా అందుకున్నాడు. కానీ ఇండస్ట్రీలో ఉండే పోటీని మాత్రం తట్టుకోలేక వెనుకబడిపోయాడు జగపతిబాబు. దీంతో మొదట్లో సూపర్ హిట్ లు అందుకున్న తర్వాత కాలంలో మాత్రం అవకాశాలు తగ్గాయి. ఇక కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో కనుమరుగయ్యాడు. ఇక జగపతిబాబు కెరియర్ ముగిసిపోయింది అనుకుంటున్నా సమయంలో... సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

 మ్యాన్లీ హీరోగా ఫ్యామిలీ స్టార్ గా పేరు సంపాదించుకున్న జగపతిబాబు.. ఏకంగా బాలయ్య లాంటి పవర్ఫుల్ హీరో సినిమాలో విలన్ పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యాడు. జగపతిబాబు ఏంటి బాలయ్య సినిమాలో విలన్ ఏంటి.. బాలయ్య లాంటి పవర్ఫుల్ హీరోని ఢీకొట్టే విలన్ పాత్రకు అసలు జగపతిబాబు సరిపోతాడా అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత అందరి  నిర్ణయం మారిపోయింది. ఆ పాత్రకు జగపతిబాబు తప్ప మరొకరు సెట్ కారు అనే రేంజ్ లో యాక్టింగ్ చేశాడు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నాడు. విలన్ గానే మాత్రమే కాకుండా హీరో హీరోయిన్ల తండ్రి పాత్రలో కూడా నటించి ఆకట్టుకున్నాడు.

 ఒకరకంగా లెజెండ్ సినిమా తర్వాత టాలీవుడ్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు జగపతిబాబు. అయితే ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. లెజెండ్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను తాను సద్వినియోగం చేసుకోలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో. నా పేరు అనౌన్స్ చేసినప్పుడు జగపతిబాబు విలన్ ఏంటి అన్నారు. అయితే ఆ సినిమా విజయం నాకు మంచి ఉత్సాహం ఇచ్చింది. కానీ సక్సెస్ ని సరిగా వాడుకోలేకపోయాను. ఆ తర్వాత కొన్ని మంచి పాత్రలే చేయగలిగాను అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: