హనుమాన్ తెలుగు వర్షన్ కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరో గా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో హనుమాన్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ టోటల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. టోటల్ రన్ మూగిసే సరికి ఈ సినిమా తెలుగు వర్షన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 39.25 కోట్లు , సీడెడ్ ఏరియాలో 11.62 కోట్లు , ఉత్త రాంధ్రలో 12.30 కోట్లు , 8.9 కోట్లు , వెస్ట్ లో 5.28 కోట్లు , గుంటూరు లో 6.35 కోట్లు , కృష్ణ 4.7 కోట్లు , నెల్లూరు లో 2.51 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90.10 కోట్ల షేర్ , 149 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి  కర్ణాటక  మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.80 ... ఓవర్ సీస్ లో 25.20 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి టోటల్ రన్ ముగిసిన సరికి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వర్షన్ కి 127.10 కోట్ల షేర్ ...222 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 27.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ ఏకంగా 9.60 కోట్ల రేంజ్ లో లాభాలను అందుకొని అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు వర్షన్ కి మాత్రమే కాకుండా ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయ్యింది. ఈ భాషల్లో కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: