అల్లు అర్జున్ తో సినిమాకి అలాంటి కండిషన్స్ పెడుతున్న అట్లీ..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పటు సినిమాతో బిజీగా ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తో సినిమా ఖాయం అన్న వార్తలు చాలా కాలంగా వినబడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇక గత ఏడాది జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు అట్లీ.  దాని తరువాత అల్లు అర్జున్తో సినిమా చేయాలి అని ఫిక్స్ అయ్యాడు ఈ డైరెక్టర్. అంతేకాదు ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయం పై అట్లీ అల్లుఅర్జున్ కి కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఇందులో భాగంగానే నిర్మాత అల్లు అరవింద్ తో చర్చలు కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అట్లు పెట్టిన కండిషన్స్ కి అల్లు అర్జున్ ఓకే చెప్తే ఈ సినిమా స్టార్ట్ చేస్తారు అని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జవాన్ సినిమా తప్పించి మిగతా అన్ని సినిమాల్లో అసలికి రిమ్యునరేషన్ తో పాటు సినిమాల్లో లాభాల షేర్ కూడా ఉందట. దాంతో ఈ ప్రాజెక్టుకి కూడా అట్లీ ఇదే కండిషన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. భారీ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా కావాలి అని అట్లీ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 కానీ అల్లు అరవింద్ మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో తగ్గితే గనక ప్రాఫిట్ షేర్ లో వాటా ఇవ్వడానికి ఎటువంటి సమస్య లేదు అని అల్లు అరవింద్ చెప్తున్నట్లు గా తెలుస్తోంది. అది ఏ రేషియోలో అనేది చర్చలు జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ప్రాజెక్టు సైన్ చేసాక..కంటిన్యూగా తనకు డేట్స్ ఇవ్వాలని, ప్రమోషన్ నుంచి అన్నీ తను దగ్గరుండి చూసుకునేలా వీలు కల్పించాలని అట్లీ మరో కండీషన్ పెట్టారట. అయితే ఎంతకాలం తన డేట్స్ బ్లాక్ చేయాలనేది ముందుగా చెప్పాలని అల్లు అర్జున్ అడిగారట.  ఇవి ఓకే చేస్తే ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: