బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్..!!

Divya
కోలీవుడ్ టాలీవుడ్ లో లేడీ విలన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి వరలక్ష్మి శరత్ కుమార్.. మొదట హీరోయిన్గా తన కెరీర్ ని మొదలుపెట్టిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత విలన్ గా ఎన్నో చిత్రాలలో సహాయ నటిగా వైవిద్యమైన పాత్రలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా కోటబొమ్మాలి, హనుమాన్ వంటి చిత్రాలలో నటించి మెప్పించింది.. త్వరలో పెళ్లి చేసుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే తన ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది.

ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి శరత్ కుమార్ గత కొన్ని లుగా ప్రేమలో ఉందట. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేసింది. ముంబై వేడుకలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మధ్య మాత్రమే నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు తాజాగా తనకు కాబోయే భర్తతో సరదాగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లింది వరలక్ష్మి శరత్ కుమార్.. ఇద్దరు జంటగా థాయిలాండ్ లో వెళ్లి అక్కడ సేద తీరుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వరలక్ష్మి తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంది.

వరలక్ష్మి బాయ్ ఫ్రెండ్ ముంబైకి చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త.. ఈయన ఆర్ట్ గ్యాలరీను నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ వేదికగా వివిధ పలు రకాల పెయింట్లను విక్రయిస్తూ ఉంటారు.. ప్రస్తుతం ఇద్దరు కూడా తమ వృత్తి రీత్యా జీవితాలను బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది వీరి వివాహాన్ని చాలా గ్రాండ్గా చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. అభిమానులు ఈ ఫోటోలకు సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి వరలక్ష్మి ఎక్కువగా తన బాయ్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేయడానికి మక్కువ చూపుతోంది. మరి వివాహమైన తర్వాత ఈ ముద్దుగుమ్మ పూర్తిగా సినిమాలకు దూరమవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: