షారుక్ ఖాన్, రోహిత్ శర్మ.. పిల్లల స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?

praveen
ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకునేవారు. ఇలా సర్కారు బడుల్లో చదువుకునే ఇక ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. ఏకంగా వీధి దీపాల కింద చదువును కొనసాగించి శాస్త్రవేత్తలుగా మారిన వారు కూడా ఎంతోమంది. కానీ ఇటీవల కాలంలో మాత్రం గవర్నమెంట్ బడులు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక ప్రైవేట్ స్కూళ్ల ఆధిపత్యం కొనసాగుతుంది.

 ఒకప్పుడు బాగా డబ్బున్నోళ్ళు మాత్రమే తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు రెడీ అయ్యేవారు. కానీ ఇప్పుడు సామాన్యులు సైతం తమ పిల్లల భవిష్యత్తు కోసం తాహతకు  మించి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కడుతూ పిల్లలను చదివిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సాదాసీదా ప్రైవేట్ స్కూళ్లలోనే ఫీజులు ఏకంగా సామాన్యుడిని భయపెట్టేల ఉన్నాయి. అలాంటిది కోట్ల రూపాయలు సంపాదించే సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూల్ ఫీజులు ఎంత ఉంటాయి అని తెలుసుకోవాలని ఆసక్తి అందరిలో ఉండడం సర్వసాధారణం. అయితే ఇక ఇప్పుడు ఇందుకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 ఇటీవల ముంబైలో ధీరుబాయ్ అంబానీ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్లో టాప్ సెలబ్రిటీల పిల్లలందరూ కూడా సందడి చేశారు. దీంతో ఈ స్కూల్ ఫీజులు ఎంత ఉంటాయి అనే విషయం తెలుసుకోవడానికి అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా ఎల్కేజీ నుంచి ఏడవ తరగతి వరకు ఫీజు నెలకి 1.70 లక్షలు ఉంటుందట. అంటే ఇందులో చదివే రోహిత్ శర్మ, షారుక్ ఖాన్, అభిషేక్ బచ్చన్ లాంటి వారి పిల్లల ఫీజు ఏడాదికి దాదాపు 20 లక్షల రూపాయలు అంటే చాలామంది ఉద్యోగుల ఏడాది జీతం కంటే ఇక ఈ స్కూల్ ఫీజు ఎక్కువే అని చెప్పాలి. ఇది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: