డేనియల్ బాలాజీ మరణానంతరం.. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు
డేనియల్ బాలాజీ మరణాంతరం కూడా గొప్ప మనసు చాటుకున్నారు. తాను చనిపోయినా కూడా ఓ రెండు జీవితాలను బ్రతికించాడు. శరీరంలోని అన్ని అవయవాల కంటే కళ్లు ప్రధానమైనవని దానర్థం. ఈ క్రమంలోనే అమరుల నుంచి కళ్లు సేకరించి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు సంకల్పించాయి. ఈ క్రమంలో డేనియల్ బాలాజీ కూడా తన నేత్రాలను దానం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. మరణం తర్వాత తన కళ్లు మరో ఇద్దరికి చూపును ఇవ్వాలను కున్నాడని కుటుంబీకులు చెప్పారు. అందుకు సంబంధించిన ఐ రిజిస్టర్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల అంగీకార ధ్రువపత్రం కూడా పొందాడు.
2001లో చితి సీరియల్తో బుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఇందులో డేనియల్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా, ఫ్రాధు ఫ్రాదు చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కీలకపాత్రలలో నటించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.