"ఓం బీమ్ బుష్" మూవీకి 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులు అయినటువంటి శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో "ఓం భీమ్ బుష్" అనే కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.  ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకు రోజు వారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కిన కలెక్షన్ ల వివరాలను ... టోటల్ గా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40 లక్షల కలెక్షన్ లు దక్కాయి.
ఇక 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ అని ముగిసే సరికి ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.80 కోట్ల షేర్ ... 10.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే మరికొన్ని రోజుల పాటు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: