హీరామండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో  'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్ రాబోతుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ.. ఈ సిరీస్‍తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైన 'హీరామండి' ఆలస్యమవుతూ వస్తోంది. అయితే.. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది..హీరామండి వెబ్ సిరీస్ ఈ ఏడాది మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. చాలా కాలం సస్పెన్స్ తర్వాత ఎట్టకేలకు ఈ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.మే 1న ఈ సిరీస్ రానుందని నెట్‍ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.హీరామండి వెబ్ సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ మరియు షార్మీన్ సేగల్  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ నుంచి ఫిబ్రవరిలో ఫస్ట్ లుక్ విడుదల అయి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్‍పై బజ్ బాగా క్రియేట్ అయింది.దీంతో ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్‍కు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

1940ల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో హీరామండి వెబ్ సిరీస్ రూపొందుతోంది. హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవనం సాగించిన డ్యాన్సర్స్ జీవితాల గురించి ఈ సిరీస్‍లో దర్శకుడు భన్సాలీ చూపించనున్నారు. బ్రిటీష్ పాలనలో దారుణాలను ఎదుర్కొన్న ఆ మహిళల గురించి  ఆసక్తికర విషయాలను తెరకెక్కిస్తున్నారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయం నాటి కథ ఇది.హీరామండి వెబ్ సిరీస్‍కు సంజీయ్ లీలా భన్సాలీతో పాటు మితాక్షర కుమార్, విభు, సేహిల్ దీక్షిత్ మెహరా, మొయిన్ బేగ్ మరియు దివ్య్ నిధి శర్మ కూడా కథను అందించారు. ఈ సిరీస్‍కు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సానీనే మ్యూజిక్ అందిస్తున్నారు. భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ లీలా భన్సాలీతో పాటు ప్రేరణ సింగ్ ఈ సిరీస్‍ను నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: