సిద్దార్థ్, అదితిరావు నిజంగా పెళ్లి చేసుకున్నారా?

Purushottham Vinay
గత కొంతకాలం నుంచి సిద్దార్థ్, అదితిరావు హైదరి డేటింగ్ చేస్తూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో తెరకెక్కిన 'మహాసముద్రం' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో..డేటింగ్ చేస్తున్నారని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే ఈ జంట మాత్రం తమ ప్రేమ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వచ్చారు.కాని సడన్ గా నిన్న మార్చి 27న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని వార్తలు వినిపించాయి.ఈ వార్త ఇంటర్నెట్ ని షేక్ చేసేసింది. తెలంగాణలోని వనపర్తి శ్రీరంగపురం టెంపుల్‌లో వీరి పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. అయితే సిద్ధార్థ్, అదితి నుంచి మాత్రం ఇప్పటి దాకా ఈ పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం సిద్ధార్థ్, అదితి సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసుకున్నారట.అదితి రావు హైదరి బాలీవుడ్ హీరోయిన్ అయిన ఆమె తెలుగు సంతతికి చెందిన అమ్మాయి.వనపర్తి సంస్థాన చివరి రాజు జే రామేశ్వర రావు కూతురు అదితి రావు హైదరి తల్లి 'విద్యారావు'. ఈ వారసత్వంతోనే వీరి పెళ్లిని వనపర్తిలో నిర్వహించడం జరిగింది.


 ఈ పెళ్లికి జే రామేశ్వర రావు వారసులు జే కృష్ణదేవర రావు కుటుంబం హాజరయ్యిందట. ఇక ఈ పెళ్లిని సిద్ధార్థ్ ఇంకా అతిథి అత్యంత రహస్యంగా చేసుకున్నారు. ఈ పెళ్లి చేయడం కోసం తమిళనాడు నుంచి పూజారులు కూడా వచ్చారట.శ్రీరంగపురం టెంపుల్‌లో పని చేసే స్థానిక పూజారులకు వీరు సినిమా షూటింగ్ అని చెప్పారట. ఇంకా అంతేకాదు స్థానిక పూజారులను ఆ సమయంలో లోపలికి కూడా అనుమంతించలేదట. ప్రస్తుతం ఆ పెళ్ళికి సంబంధించిన డెకరేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సిద్ధార్థ్, అదితి నిజంగానే పెళ్లి చేసుకున్నారా..? లేదా వాళ్ళు చెప్పినట్లు సినిమా షూటింగేనా..? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరికీ ఇది వరకే పెళ్లిళ్లు అయ్యాయి. అదితి రావు హైదరి బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాని 2009 లో పెళ్లి చేసుకుంది. తరువాత కొన్ని కారణాల వల్ల 2013 లో విడిపోయారు. అలాగే సిద్ధార్థ్ కూడా 2003లో మేఘన నారాయణ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని 2007 లో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత హన్సిక, సమంత లాంటి హీరోయిన్స్ తో సిద్ధార్థ్ డేటింగ్ చేశాడు. శృతి హాసన్ తో కూడా డేటింగ్ చేసినట్లు అప్పట్లో గాసిప్స్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: